జాతీయ రహదారి నిర్మాణంతో కొల్లాపూర్‌ రూపురేఖలు మారుతాయి

ABN , First Publish Date - 2022-12-15T22:40:52+05:30 IST

జాతీయ రహదారి ఏర్పడితే కొల్లాపూర్‌ నియోజకవర్గం రూపు రేఖలు మారిపోతాయని బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు.

జాతీయ రహదారి నిర్మాణంతో కొల్లాపూర్‌ రూపురేఖలు మారుతాయి
మాట్లాడుతున్న సుధాకర్‌రావు

- బీజేపీ కొల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు

వీపనగండ్ల, డిసెంబరు 15: జాతీయ రహదారి ఏర్పడితే కొల్లాపూర్‌ నియోజకవర్గం రూపు రేఖలు మారిపోతాయని బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు. గురు వారం మండల పరిధిలోని తూంకుంట, నాగర్లబండ గ్రామం, తండాలో ప్రగతి కోసం పాద యాత్ర చేపట్టారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడితే పరిశ్ర మలు వస్తాయని దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, బీజేపీని ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో తూంకుంట సర్పంచ్‌ మానస, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్‌, శ్రీని వాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:40:53+05:30 IST