పింఛన్ వస్తుందా?
ABN , First Publish Date - 2022-12-31T22:51:16+05:30 IST
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం గోపాల్పేట మండలం బుద్దారం గామంలో రైతులతో ముచ్చటించారు.
రైతులతో మంత్రి నిరంజన్‌రెడ్డి ముచ్చట్లు
వనపర్తి జిల్లా బుద్దారంలో జాగీర్ధార్ కాల్వ ప్రారంభం
గోపాల్పేట, డిసెంబరు 31: వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం గోపాల్పేట మండలం బుద్దారం గామంలో రైతులతో ముచ్చటించారు. గ్రామంలో జాగీర్ధార్ కాలువను ప్రారంభించడానికి వచ్చిన ఆయన వేరుశనగ పొలంలో కూర్చొని మాట్లాడారు. గ్రామానికి చెందిన రైతు కుర్వ కాశన్నతో మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమా పథకాల గురించి ఆరా తీశారు. పింఛన్ వస్తుందా? అని అడుగగా రైతు వస్తుందని చెప్పాడు. పంట మార్పిడి చేస్తే మంచి దిగుబడి వస్తందని మంత్రి అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వందేళ్ల నాటి జాగీర్ధార్ కాలువకు పునర్జీవం పోశామని, ఈ కాల్వ కింద ఎంజీఎల్‌ఐ ద్వారా నాలుగు వేల ఎకరాలకు నీరందిస్తున్నామని చెప్పారు. అనంతరం గోపాల్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రేవల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బోధన విద్యాభ్యాస సామగ్రి మేళాను ప్రారంభించారు. అధ్యాపకులు నిరంతరం అధ్యయనం చేసి, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఇంటర్, డిగ్రీ స్థాయి తరగతులకు కూడా తొలిమెట్టు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.