పర్యావరణాన్ని రక్షించలేని మానవజన్మ దేనికి?

ABN , First Publish Date - 2022-12-31T22:56:03+05:30 IST

కలుషిత మవుతు న్న పర్యావరణాన్ని రక్షించలేని మానవజన్మ దేనికని వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నారు.

పర్యావరణాన్ని రక్షించలేని మానవజన్మ దేనికి?
బయోడిగ్రేడబుల్‌ సంచులను చూపిస్తున్న అధికారులు, డీఆర్‌డీఏ సైంటిస్టు

- మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌

- బయోడిగ్రేడబుల్‌ సంచులపై వ్యాపారులకు అవగాహన

- ముఖ్య అథితిగా హాజరైన డీఆర్‌డీఏ సైంటిస్ట్‌ వీర బ్రహ్మం

వనపర్తి టౌన్‌, డిసెంబరు 31: కలుషిత మవుతు న్న పర్యావరణాన్ని రక్షించలేని మానవజన్మ దేనికని వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కన్యాకపరమేశ్వరీ దేవా లయ సమావేశ మందిరంలో బయోడిగ్రేడబుల్‌ సంచుల వాడకం గురించి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ సృష్టిలోని పంచ భూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమిని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ వల్ల భూమి, నీరు కలుషితమవు తున్నాయని అన్నారు. ప్లాస్టిక్‌ ప్రభావం మూగ జీవాలపై కూడా పడుతుండటం ఆవేదన కలిగిస్తుం దని అన్నారు. ఎవరికి వారు సంకల్పించుకుని పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. రేపటి తరాలకు మనం ఏమి సందేశం ఇస్తున్నామో కూడా తెలియకుండా పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన డీఆర్‌డీఏ సైంటీస్టు డాక్టర్‌ వీరబ్రహ్మం మాట్లాడు తూ ప్లాస్టిక్‌ కవర్లకు బదులు మొక్కజొన్న పొట్టుతో తయారు చేసిన కవర్లను వాడాలని, వీటితో పర్యావ రణానికి ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ఈ కవర్లను కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించిందని తెలిపారు. భూమిలో సులువుగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్‌ కవర్లు మానవాళికి శ్రేయస్కారమ న్నారు. అనంతరం కవర్లు నీటిలో సులువుగా కరిగి పోయే విదానాన్ని చేసి చూపించారు. అదనపు కలెక్ట ర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ బయోడిగ్రేడబుల్‌ కవర్ల ప్రాముఖ్యతను వ్యాపారులు కస్టమర్లకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మునిసి పల్‌ కమిషనర్‌ విక్రమసింహారెడ్డి, శానిటరీ ఇన్‌ స్పెక్టర్‌ రమేష్‌, గ్రీన్‌స్మార్ట్‌ టెక్నాలజీ సంస్థ సీఈవో రామకృష్ణ, డైరెక్టర్‌ జీఎస్‌ఎన్‌ మూర్తి, రమణి ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ రమణి, శతాబ్ది గ్రూప్‌ మార్కె టింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:56:03+05:30 IST

Read more