బొటానికల్ గార్డెన్లో వృక్ష రక్షాబంధన్
ABN , First Publish Date - 2022-08-13T05:35:30+05:30 IST
పట్టణంలోని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్లో ఎన్ఎస్ఎస్ 2, 3 యూనిట్ విద్యార్థినులు శుక్రవారం వృక్షాలకు రాఖీలు కట్టారు.
బాదేపల్లి, ఆగస్టు 12 : పట్టణంలోని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్లో ఎన్ఎస్ఎస్ 2, 3 యూనిట్ విద్యార్థినులు శుక్రవారం వృక్షాలకు రాఖీలు కట్టారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా వృక్షలకు రాఖీ కట్టి వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదాశివయ్య, సుభాషిణి, విద్యార్థినులు పాల్గొన్నారు.