భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ జయంతి

ABN , First Publish Date - 2022-09-18T04:58:16+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ జయంతి
జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి నిర్వహిస్తున్న విశ్వకర్మలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌/ పాలమూరు/ దేవరకద్ర/ నవాబ్‌పేట/ జడ్చర్ల, సెప్టెంబరు 17 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో మౌనేశ్వర స్వామి దేవాలయంలో స్వర్ణకార సంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో తూర్పు కమాన్‌ నుంచి ఊరేగించారు. హోమం నిర్వహించారు. ఆబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల శేఖర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వీరబ్రహ్మ దేవాలయం దగ్గర నుంచి మౌనేశ్వరి ఆలయం వరకు పట్టువ స్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేవరకద్రలో విశ్వకర్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. విశ్వకర్మ సంఘం నాయకులు ఆంజనేయులు, బాలస్వామి, లక్ష్మీనారాయ ణచారి, రత్నయ్యచారి, యదయ్య, వీరచారి, రవీందర్‌ చారి, నరసింహ చారి, శ్రీనివాసులు, శ్రీను, రాజు, సత్తి, రాము, మహిళలు పాల్గొన్నారు. నవాబ్‌పేటలో విశ్వకర్మ సంఘం అధ్యక్షు డు వెంకటయ్యచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు పాండురంగాచారి, శేఖరాచారి, శ్రీనివాసచారి పాల్గొన్నారు. చిన్నచింతకుంట మండలంలో రుద్రలింగేశ్వరస్వామి ఆలయంలో విశ్వకర్మ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ కులస్తులు పూజలు చేశారు. విశ్వకర్మ భగవానుడి ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. విశ్వబ్రాహ్మణులు కొన్నూరు శ్రీనివాసులు, సుదర్శన్‌చారి, దామోదర్‌చారి, వేణుగోపాల్‌చారి, శ్రీనివాసులుచారి  పాల్గొన్నారు. జడ్చర్లలోని పోతులూరీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-18T04:58:16+05:30 IST