వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-16T05:33:01+05:30 IST

వట్టెం అడ్డగట్టుపై వెలిసిన వేంకటేశ్వర స్వామి 37వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి.

వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అనంత నరసింహారెడ్డి

బిజినేపల్లి, మార్చి 15 : వట్టెం అడ్డగట్టుపై వెలిసిన  వేంకటేశ్వర స్వామి 37వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధా న అర్చకులు శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజ కార్యక్ర మాలు నిర్వహించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మృత్యగ్రహాణం, అం కురార్పణం వంటి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అనంత నరసింహారెడ్డి, ఆలయ సహావ్యవ స్థాపకులు సందడి ప్రతాప్‌రెడ్డి, కొత్త చంద్రారెడ్డి పాల్గొన్నారు. 

Read more