సమైక్యతను కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2022-09-17T05:46:27+05:30 IST

జాతీయ సమైక్యతను కాపాడుకునే బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్‌ మున్నా బాషా అన్నారు.

సమైక్యతను కాపాడుకోవాలి
గద్వాల పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఎంఐఎం నాయకులు

- ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్‌ మున్నా బాషా 

- గద్వాల పట్టణంలో బైక్‌ ర్యాలీ

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 16 : జాతీయ సమైక్యతను కాపాడుకునే బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్‌ మున్నా బాషా అన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో విలీనం కావడం సమైక్యతలో భాగమేనన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గద్వాల పట్టణంలో వారు బైక్‌ర్యాలీ నిర్వహించారు. మక్కా మసీదు నుంచి ప్రారంభమైన ర్యాలీ వైఎస్‌ఆర్‌ చౌక్‌ వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన సభలో మున్నాబాషా మాట్లాడుతూ రజాకార్ల దాడు లు, కమ్యూనిస్టుల పోరాటం, మరోవైపు ఇండియన్‌ పోలీసులు మధ్య సాగిన సంఘర్షణలో తెలంగాణ ప్రజలు ఆటుపోట్లను తట్టుకుని సమైక్యంగా ముంద డుగు వేస్తుండటం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తి తో అన్ని వర్గాలు, మతాల ప్రజలు సమైక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చరిత్రను వక్రీ కరిస్తున్న కుసంస్కారుల కుటిల బుద్ధిని ప్రజలకు వివరించేందుకు మేధావులు, సామాజికవేత్తలు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకు లు అల్తాఫ్‌ హుసేన్‌, ఎండీ రఫీ, షఫీ, షర్ఫుద్దీన్‌, రఫీ, ఇలియాస్‌, సులేమాన్‌, రియాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-17T05:46:27+05:30 IST