హక్కులు దక్కాలంటే ఐక్యంగా ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-09-12T04:45:18+05:30 IST

పేదలకు హక్కులు దక్కాలంటే పాలకులు అవలంభిస్తున్న విధానా లకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు పుట్ట ఆంజనేయులు పిలుపునిచ్చారు.

హక్కులు దక్కాలంటే ఐక్యంగా ఉద్యమించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర నాయకుడు పుట్ట ఆంజనేయులు

-సీపీఎం రాష్ట్ర నాయకుడు పుట్ట ఆంజనేయులు


బల్మూరు, సెప్టెంబరు 11: పేదలకు హక్కులు దక్కాలంటే పాలకులు అవలంభిస్తున్న విధానా లకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు పుట్ట ఆంజనేయులు పిలుపునిచ్చారు. బల్మూరు మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులకు పార్టీ మండల కార్య దర్శి ఎం.శంకర్‌నాయక్‌ అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకుడు పుట్ట ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గత పాలకుల హయాంలో బల్మూరులో సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పో రాటం చేసి స్థలాలు దక్కించుకున్నామని, ప్రస్తు తం ఆ స్థలాలను రద్దు చేయడం దుర్మార్గమన్నా రు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిన పేదలకు పట్టాలు ఇచ్చి నిర్మాణం చేసుకునే అవ కాశం కల్పించాలని, లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు మ హేందర్‌, కాశన్న, బాలేశ్వర్‌, బాబర్‌, ఆంజనే యులు, మాసయ్య, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. 

Read more