ప్రకృతితో తమాషాలు చేస్తే ఇలానే ఉంటది

ABN , First Publish Date - 2022-10-08T05:46:40+05:30 IST

అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించినా, ప్రకృతితో తమాషా లు చేసినా ప్రకృతి చూపే ఆగ్రహం ఇలానే ఉంటుం దని, ఇందుకు ముంపునకు గురైన పాలమూరు లోతట్టు ప్రాంతాలే నిదర్శనమని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు.

ప్రకృతితో తమాషాలు చేస్తే ఇలానే ఉంటది
వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

- పరిపాలన వైఫల్యం కారణంగానే ముంపు

- వెంటనే పరిష్కారం చూపాలి

- మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 7 : అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించినా, ప్రకృతితో తమాషా లు చేసినా ప్రకృతి చూపే ఆగ్రహం ఇలానే ఉంటుం దని, ఇందుకు ముంపునకు గురైన పాలమూరు లోతట్టు ప్రాంతాలే నిదర్శనమని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వరద కారణంగా ముంపునకు గురైన రామ య్యబౌలి, శివశక్తినగర్‌, బీకే రెడ్డి కాలనీలలో పర్యటిం చారు. ఈ సందర్భంగా ఇళ్లలోకి నీరు చేరిన బాధితు లతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు. ఇదివరకు పెద్దచెరువు అభివృద్ధికి ఎన్నో ప్రణాళి కలు తయారు చేశారని, స్థానిక మంత్రి తాను మాజీ మునిసిపల్‌ కమిషనర్‌ను అని సొంతంగా డిజైన్‌ తయారు చేశారని, అందుకే ప్రకృతి ఏంటో చూయి స్తోందని చెప్పారు. చెరువులోకి నీరు రావాల్సిందేనని, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మురుగునీటిని ఫిల్టర్‌చేసి చెరువులోకి వదిలితే ఈ నీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. అలాకాకుం డా చెరువులోకి వచ్చే నీటిని మళ్లించడం వల్లనే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు తడిసిపోతున్నాయన్నారు. పలు కాలనీలలో ఇళ్లల్లో నీరు రావడం వల్ల జనం అవస్థలు పడుతున్నార న్నారు. దీనంతటికి పరిపాలన వైఫల్యమై కారణమని చెప్పారు. కబ్జాల కారణంగానే ముంపు జరిగిందని చెప్పడంలో అర్థం లేదని, మరి వారికి అనుమతులు ఎవరిచ్చారని, ఇంటినెంబర్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. చెరువులో బోటింగ్‌ చేస్తుంటే, డెక్క తీస్తుంటే ఇక్కడ విహారయాత్రకి రావచ్చని ప్రజలు భావించారని, ఆనాడు తాను ఎంపీగా ఉన్నపుడే పైనుంచి వచ్చే నీటిని మనము ఆపలేమని చెప్పినట్లు గుర్తు చేశారు. అప్పులు తీసుకువచ్చి ఇష్టానుసారంగా ప్రజలకు ఉపయోగం లేని పనులు చేస్తున్నారని, రేపు ప్రభుత్వం రద్దయిన తరువాత కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వెంటపడతారన్నారు. మరో 15 రోజులపాటు వర్షాలు ఉన్నట్లు చెబుతున్నారని, దీనికి పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, నాయకులు పోతుల రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more