మండలం ఏర్పాటుకు సహకరించాలి
ABN , First Publish Date - 2022-10-23T23:33:50+05:30 IST
ఎర్రవల్లి మండలం ఏర్పాటుకు తన వంతు సహకారాన్ని అందించాలని మండల సాధన సమితి సభ్యులు, నాయకులు ఎమ్మెల్యే అబ్రహాంను కోరారు.
- ఎమ్మెల్యే అబ్రహాంను కోరిన ఎర్రవల్లి గ్రామస్థులు
అలంపూర్ చౌరస్తా, అక్టోబరు 23 : ఎర్రవల్లి మండలం ఏర్పాటుకు తన వంతు సహకారాన్ని అందించాలని మండల సాధన సమితి సభ్యులు, నాయకులు ఎమ్మెల్యే అబ్రహాంను కోరారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమా వేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి నూతన మండలం ఏర్పాటు కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, అయన కూడా సానుకులంగా స్పందించారని ఎమ్మెల్యే వారికి తెలిపారు. కార్యక్రమంలో ఇటిక్యాల మండల అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, సర్పంచు సుంకన్న, ఈదన్న, శివుడు, సుధాకర్‌రెడ్డి, హుస్సేన్, నరసింహులు, మల్లేష్, నీలి శ్రీనువాసులు, మండల సాధన సమితి సభ్యులు రంగన్న, కృష్ణసాగర్, మాజీ సర్పంచ్ లోకేశ్వరరెడ్డి, భీమేశ్వరరెడ్డి, గుమ్మగోవర్ధన్, రాజేష్, జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి అందజేత
ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి సర్పంచు ఈదన్న సతీమణి మాణిక్యమ్మకు మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.2.5 లక్షలు మంజూరయ్యాయి. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్యే అబ్రహాం ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సర్పంచ్ ఈదన్నకు అందించారు.
త్వరలో మినీ బస్ డిపో ఏర్పాటు
అలంపూర్ నియోజకవర్గంలో త్వరలో మినీ బస్సు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు అర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని, అర్టీసీ ఎండీ సజ్జనార్‌లను కలిశానని తెలిపారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు ఎమ్మెల్యే అబ్రహాంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గద్వాల డిపో మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో బస్సుల కొరతపై ఎమ్మెల్యే అబ్రహాం పలుమార్లు తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని త్వరలో నాలుగు మినీ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలంపూర్ చౌరస్తా నుంచి అయిజ రూట్లో రెండు బస్సులు, అలంపూర్ ఆలయానికి మరో రెండు బస్సులను నడిపిం చనున్నట్లు తెలిపారు. బస్సుల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యే అబ్రహాంను ఆయన ఆహ్మానిం చారు. కార్యక్రమంలో ఆసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ గౌడ్, ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు.