ఏర్పాట్లలో కొత్తదనం కనిపించాలి

ABN , First Publish Date - 2022-10-15T05:19:35+05:30 IST

రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూ చించారు.

ఏర్పాట్లలో కొత్తదనం కనిపించాలి
జాతర మైదానంలో అధికారులతో ఏర్పాట్లపై పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌, సంబంధిత అధికారులు

- కురుమూర్తి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష

- పాల్గొన్న అదనపు కలెక్టర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌, ఇతర శాఖల అధికారులు

చిన్నచింతకుంట, అక్టోబరు 14 : రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూ చించారు. ఈ నెల 26 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం మండ లంలోని అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో గల కురుమూర్తి వేంకటేశ్వర స్వామి జాతర మైదా నంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీఏటా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఒక కొత్తదనం కనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతర మైదానంలో ఎలాంటి అసౌకర్యం కలగ కుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయా లని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కోనేరు, గుడి, బస్టాండ్‌ తదితర ప్రాం తాలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. స్వామి వారి గుట్ట పై భాగంలో ఫ్లవర్‌ డెక రేషన్స్‌తోపాటు భక్తులను ఆకర్షించే విధంగా జాతర మైదానంలోను, గుట్ట ప్రాంతంలోను విద్యుద్దీపాలతో అలంకరించాలని తెలిపారు. అధికారులంతా కలిసికట్టుగా దేవుని సేవలో తాము పని చేస్తున్నామన్న భావనతో సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చే యాలని కోరారు. అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు గాను ప్రత్యేకించి అధికారులతో కమిటీలు వేస్తున్నామని తెలిపా రు. తాగునీటి సౌకర్యం, బారికేడ్లు ఇతర సౌకర్యాలను ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ మూర్తి, ఆర్‌అండ్‌బీ ఈఈ స్వామి, జడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డీవో అనిల్‌ కుమార్‌, డీఆర్డీవో యాదయ్య, డీఎంఅండ్‌హెచ్‌వో కృష్ణ, స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, తహసీల్దార్‌ సువర్ణ రాజు, ఎంపీడీవో శ్రీనివాసులు, కురుమూర్తి, ఆలయ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు వట్టెం రాజేశ్వరి, అమ్మాపూర్‌ గ్రామ సర ్పంచ్‌ సులోచనమ్మ, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఆపద కాలంలో పేదలకు వరం 

- సీఎంఆర్‌ఎఫ్‌ పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే ఆల

భూత్పూర్‌, అక్టోబరు 14 : ఆపద కాలంలో పేదలకు వరంలా ముఖ్యమంత్రి సహాయ నిధి తోడవుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్‌ గ్రామంలో ఎమ్మెల్యే ఆల తన నివాసం దగ్గర నియోజవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 150 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 58,05,800 చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలకు ఆసుపత్రులకు అయ్యే ఖర్చులు ఇవ్వడానికి ఎంత డబ్బు అయినా అందిస్తున్నారని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మునిసి పాలిటీ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్‌ బండ్‌ను పరిశీలించారు. అన్నాసాగర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి రూ.10లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్‌, సాయిలు, సింగిల్‌విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌, నాయకులు నారాయణగౌడ్‌, మురళీధర్‌గౌడ్‌, మేకల సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌గౌడ్‌, బ్రహ్మయ్యచారి పాల్గొన్నారు.

Read more