రాజ్యాంగం లేకుంటే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2022-03-18T05:44:58+05:30 IST

అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారి రాచరిక వ్యవస్థ వస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు.

రాజ్యాంగం లేకుంటే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం
మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

- ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

మక్తల్‌, మార్చి 17 : అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారి రాచరిక వ్యవస్థ వస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మక్తల్‌ పట్టణంలో ఏప్రిల్‌ 9న జరగనున్న యుద్దభేరి సన్నాహక సదస్సులో పాల్గొని మాట్లాడారు. కుటుంబ పాలన సాగించాలనే దురుద్దేశంతో సీఎం కేసీఆర్‌ అహంకారంతో రాజ్యాంగాన్ని మార్చాలనడం సిగ్గుచేటన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే తనకు ఆ పదవి వచ్చిందనే విషయాన్ని విస్మరించరాదన్నారు. రాజ్యాంగం లేకుంటే ప్రజా స్వామ్యం ఎక్కడుండేదని, రిజర్వేషన్లు ఎలా వస్తాయని,. మాట్లాడే హక్కు సైతం కోల్పోతామన్నారు. బడుగు, బలహీన వర్గాలు, ప్రజా, కుల సంఘాలు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యుద్దభేరి సభను జయప్రదం చేయాలన్నారు. కార్యక్ర మంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గుడిసె వెంకటయ్య, నాగేష్‌, నారాయణ, రాజు, నర్సిములు, శంకరమ్మ, ఊట్కూర్‌, నర్వ, మక్తల్‌, మాగనూరు మండలాల ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-03-18T05:44:58+05:30 IST