ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ నది

ABN , First Publish Date - 2022-09-12T04:46:37+05:30 IST

వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో దుం దుభి నది ఉధృతంగా ప్రవ హిస్తోంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ నది
తాడూరు మండలంలో ప్రవహిస్తున్న దుందుభీ నది

తాడూరు, సెప్టెంబరు 11: వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో  దుం దుభి నది ఉధృతంగా ప్రవ హిస్తోంది. ఆదివారం మండ లంలోని సిర్సవాడ దుందుభీ నది ప్రవాహం కొనసాగు తున్న సమయంలో మాదా రం గ్రామం నుంచి సిర్స వాడ గ్రామానికి వస్తున్న ఓ ట్రాక్టర్‌ దుందుభి నదిలో ప్రమాదవశాత్తు సీసీ రోడ్డుపై నుంచి కిందికి ఒరిగిపో యింది. గమనించిన గ్రామస్థులు ఎక్స్‌కవే టర్‌ సహాయంతో ఒరిగిపోయిన ట్రాక్టర్‌ను బయటకు తీశారు. మూడు నెలలుగా నిరంతరాయంగా నది ప్రవహిస్తోందని, దుందుభి నదితో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఇక్కడ వెంటనే బ్రిడ్జి నిర్మాణా నికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Read more