ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-19T04:57:05+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ కార్యకర్తలు సోమవారం నారాయణపేట పురపార్కు ముందు ధర్నా నిర్వహించగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, కార్యదర్శి బాల్‌రామ్‌ మా ట్లాడారు.

ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి
తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఆశ కార్యకర్తలు

నారాయణపేట టౌన్‌, జూలై 18 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ కార్యకర్తలు సోమవారం నారాయణపేట పురపార్కు ముందు ధర్నా నిర్వహించగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, కార్యదర్శి బాల్‌రామ్‌ మా ట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయ న్నారు. ఆశలకు కనీస వేతనం ఇవ్వాలని, పనికి తగిన పారితోషికం అంటూ టీబీ స్కూటమి డబ్బాలు మోపిస్తున్నారని, టెస్టులు చేయించడం వంటి పనులు చేయించడం సిగ్గుచేటు అన్నారు. 45వ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫారసు మేరకు ఆశలను కార్మికులుగా గుర్తించి పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి చట్టబద్ధత సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ దానయ్యకు వినతి పత్రం అందించారు. సీఐటీయూ నాయ కుడు కృష్ణయ్య, ఆశలు నాగమణి, జ్యోతి, విజ యలక్ష్మి, రాధిక, అనురాధ, కవిత పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-19T04:57:05+05:30 IST