చెరువులు నీటితో కళకళలాడాలి

ABN , First Publish Date - 2022-07-06T04:49:44+05:30 IST

చెరువులు నీటితో కళకళలాడాలని కేంద్ర జలశక్తి అభి యాన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పి అనురాధ అ న్నారు.

చెరువులు నీటితో కళకళలాడాలి
లింగోటంలో పెద్ద చెరువును పరిశీలిస్తున్న కేంద్ర జలశక్తి అభియాన్‌ జాయింట్‌ డైర్టెకర్‌ అనురాధ

-  కేంద్ర జలశక్తి అభియాన్‌ జాయింట్‌ డైరెక్ట ర్‌  అనురాధ 

-  చెరువు కట్టల ఇరువైపులా మొక్కలు నాటాలి   

 అచ్చంపేట అర్బన్‌, జూలై 5 : చెరువులు నీటితో కళకళలాడాలని కేంద్ర జలశక్తి అభి యాన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పి అనురాధ అ న్నారు. మంగళవారం మండల పరిధిలోని లిం గోటం, హాజీపూర్‌, రంగాపూర్‌ పంచాయతీలో ని అటవీ శాఖ ఆధ్వర్యంలోని చెరువులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ మండలంలో జలశక్తి అభియాన్‌ పఽథకం కింద ఐదు చెరువులు ఎంపికైనట్లు తెలిపారు. ఒక్కో చెరువును రూ. 10లక్షల వ్యయంతో అభి వృద్ధి చేయనున్నట్లు తెలిపారు.  చెరువుల కట్టలు ఎత్తు పెంచడం, చెరువుల్లో పూడిక తీత పనులు రెండువారాల్లో పూర్తి చేయించాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు.  చెరువు కట్టలకు ఇరువైపులా మామిడి, జామ, కర్జూరం, ఈత మొక్కలను నాటాలని సంబంధి త అధికారులను ఆదేశించారు.  ఆమె వెంట జి ల్లా టెక్నికల్‌ అధికారి ప్రసాదు, డీఆర్‌డీవో న ర్సింగ రావు, అదనపు పీడీ రాజేశ్వరి, ఎంఐఎస్‌ సీవో తాహెర్‌అలీ, ఏవో నటరాజ్‌, ఎంపీడీవో మధుసూదన్‌గౌడు, ఈజీఎస్‌ ఏపీవో పర్వతాలు,   సీడీపీవో దమయంతి, రంగాపూర్‌ సర్పంచు లో క్యానాయక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు పరమేష్‌, మ హేందర్‌, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 

 ఉమామహేశ్వరి సన్నిధిలో పూజలు

 శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారమైన శ్రీ ఉమా మహేశ్వరి క్షేత్రంలో మంగళవారం కేంద్ర జల శక్తి అభియాన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అనురాధ   ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సిబ్బంది ఆమెకు ఆలయం వద్ద ఘనంగా స్వా గతం పలికారు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన లణపతి అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకు లు వీరయ్య, రవీుమార్‌ రాజశేఖర్‌ ఆల య చరిత్ర వివరించారు. ఆలయ సిబ్బంది రామ కృష్ణ, కవికుమార్‌ లక్ష్మయ్యలు ఆలయం ఆవరణలో సన్మానించారు. 

పల్లె ప్రకృతి వనాల పరిశీలన 

తెలకపల్లి: మండలంలోని లక్నారం గ్రామ పంచాయతీ ఉపాధి హామీ నిధుల నుంచి పది ఎకరాలలో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వ నాన్ని మంగళవారం సెంట్రల్‌ లెవల్‌ టీమ్‌ ఎస్‌.అనురాధ, జాయింట్‌ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ ఈస్ట్రన్‌ విభాగం డీఎస్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఉ పాధి హామీలో చేపట్టిన పనులను గుట్ట ప్రాం తంలో 26,200మొక్కలు వందశాతం బతి కించడంపై అక్కడ పని చేసే వాచర్స్‌ను, ప్ర త్యేక శ్రద్ధ తీసుకుంటున్న సర్పంచ్‌, సెక్రటరీకి, మండలస్థాయి టీమ్‌మెంబర్స్‌ను  సెంట్రల్‌ టీ మ్‌ అధికారులు అభినందించారు. ఈ సంద ర్భంగా టీం సభ్యులు మొక్కలు నాటారు.  కార్య క్రమంలో  ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎల్‌కేడీ సీడ బ్ల్యూఎస్‌ హైదరాబాద్‌ జిల్లా అధికారులు నర్సింగ్‌రావు, డిప్యూటి డీఆర్‌డీఏ రాజేశ్వరి, ఏవో నటరాజ్‌, సర్పంచ్‌ సాయిపల్లవి, పంచాయతీ కార్యదర్శి గుల్మహమద్‌, ఏపీవో రవిరాజు, టీఏ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more