చెరువులను నింపాలి
ABN , First Publish Date - 2022-06-27T05:14:42+05:30 IST
రిజర్వాయర్ ద్వారా చెరువులు నింపి సాగుకు నీరు ఇవ్వాలని రైతు సంఘం మండల అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి కోరారు.

అయిజ, జూన్ 26: రిజర్వాయర్ ద్వారా చెరువులు నింపి సాగుకు నీరు ఇవ్వాలని రైతు సంఘం మండల అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి కోరారు. ఆదివారం అయిజ రైతు సంఘం అధ్వర్యంలో అయిజ, సంకాపూర్, ముచ్చోనిపల్లి రైతులు దాదాపు 100 మంది ముచ్చోనిపల్లి రిజర్వాయర్, కాల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనా చెరువులకు నీరు చేరలేదన్నారు. ఇంకా వ్యవసాయం ఎలా చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చోనిపల్లి, తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వాయర్ల పరిధిలోని ఆయకట్టు ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా అ యిజ చెరువులకు నీరు చేరటం లేదని ఆరోపించారు. రిజర్వాయర్ ద్వారా చెరువులు నింపి సాగుకు నీరు ఇవ్వాలని కోరారు. విషయాన్ని ఎమ్మెల్యే అబ్రహాం దృష్టికి తీసు కెళ్లగా, సానుకూలంగా స్పందిచారని తెలిపారు. కార్యక్రమంలో రైతులు తెలుగు గోవిం దు, నర్సింహులు, లక్ష్మన్న పాల్గొన్నారు.