పోలీసులు ప్రజాభిమానం చూరగొనాలి

ABN , First Publish Date - 2022-12-15T23:18:46+05:30 IST

పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజాభిమానం చూరగొనాలని డీఎస్పీ మహేష్‌ అన్నారు.

పోలీసులు ప్రజాభిమానం చూరగొనాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ మహేష్‌

- పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ మహేష్‌

నవాబ్‌పేట, డిసెంబరు 15 : పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజాభిమానం చూరగొనాలని డీఎస్పీ మహేష్‌ అన్నారు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను రూరల్‌ సీఐ రాజేష్‌గౌడ్‌తో కలిసి తనికీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు వివిధ సమస్యలపై తమ వద్దకు వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు ఇబ్బందులు కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఈ ఏడాదికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం ఎంపీ సోదరుడు మృతిచెంది విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఎస్‌ఐ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-12-15T23:18:49+05:30 IST