మార్కెట్ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-25T05:22:18+05:30 IST
జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల టౌన్, మే 24 : జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలో రూ.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్ ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్ మురళి, కేటీదొడ్డి జీడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ ఉన్నారు.
ఉచిత వైద్య సేవలు మరింత విస్తరించాలి
ఉచిత వైద్య సేవలను మరింతగా విస్తరించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక మహేశ్ దంత వైద్యశాల వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలోని బాలభవన్‌లో వేసవి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. చిన్నారులకు టూత్‌పేస్టు, బ్రష్‌లను అందించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కేటీదొడ్డి జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్, కౌన్సిలర్లు నరహరి శ్రీనివాసులు, శ్రీనుముదిరాజ్, కృష్ణ, మహేష్, నాయకులు రంజిత్, జనార్దన్ రెడ్డి, రిజ్వాన్, భగీరథ వంశీ, నవీన్ రెడ్డి, కృష్ణ, వీరేష్ పాల్గొన్నారు.