ప్రజల ఆకాంక్షలు విస్మరించిన కేసీఆర్‌ సర్కారు

ABN , First Publish Date - 2022-05-23T04:41:30+05:30 IST

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలు విస్మరించిన కేసీఆర్‌ సర్కారు
మాట్లాడుతున్న తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం

మక్తల్‌, మే 22 : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం మక్తల్‌ పట్టణంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఉపాధ్యాయుడు నర్సింహులు సంస్మరణ సభకు హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అంటూ తెలంగాణ ఉద్యమం చేశామని తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు దాటినా నిధులు, నియామకాలు కేసీఆర్‌ కుటుంబానికే దక్కాయని తెలం గాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. మనకు రావల్సిన నీటి వాటా దక్కించు కోక ఆంధ్రా ముఖ్యమంత్రితో చేతులు కలిపి, కలిసి పనిచేస్తామని చెప్పడం వి డ్డూరమన్నారు. వలసలకు పేరుగాంచిన ఈ ప్రాంతం నుంచి ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీలో ఊదరగొట్టిన కేసీఆర్‌ ఇప్పుడు కేవలం 18వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న జూరాల వెనక జలాలతో జయమ్మ చెరువు నింపి అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులకు నీటిని తరలించవచ్చన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అయ్యేదెన్నడో కేసీఆర్‌ ప్రభుత్వానికే తెలియాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో నర్సింహులు చేసిన పోరాటా న్ని స్మరించుకున్నారు. నర్సింహులు ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కాశీం, సూర్యప్రకాష్‌ ప్రజా సంఘాల నాయకులు సూర్య చంద్ర, హైమావతి, పోలప్ప, ఇస్మాయిల్‌, హైమావతి, కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T04:41:30+05:30 IST