వసతిగృహ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2022-08-05T04:54:08+05:30 IST

హాస్టల్‌ ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవా లని బీసీ అభివృద్ధి జిల్లా సహాయ అధికారి బీరం సుబ్బారెడ్డి సూచించారు.

వసతిగృహ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
హాస్టల్లో భోజనాన్ని తనిఖీ చేస్తున్న సుబ్బారెడ్డి

- బీసీ అభివృద్ధి జిల్లా సహాయ అధికారి బీరం సుబ్బారెడ్డి 

  

వనపర్తి రూరల్‌, ఆగస్టు 4: హాస్టల్‌ ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవా లని బీసీ అభివృద్ధి జిల్లా సహాయ అధికారి బీరం సుబ్బారెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నాగవరం బీసీ బాలుర వసతిగృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను పరిశీలించి, రుచి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన, రుచికరమైన వేడివేడి భోజనం, పరిశుభ్రమైన తాగునీరు అం దించాలని అన్నారు. వసతిగృహం ఆవరణం చుట్టుపక్కల పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని విద్యార్థులకు సూచించారు. వసతిగృహానికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి వసతిగృహ ఆవరణలో హరితహారం మొక్కలు నాటి, నీరు పోసి సంరక్షించాలని వసతి గృహ సంక్షేమ అధికారి ఆంజనేయులుకు సూచించారు. కార్యక్రమంలో నాలుగో తరగతి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-05T04:54:08+05:30 IST