కేంద్రం క్రీమిలేయర్‌ను ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2022-03-18T05:46:05+05:30 IST

బీసీలకు ఇబ్బందిగా మారిన క్రీమీలేయర్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

కేంద్రం క్రీమిలేయర్‌ను ఎత్తివేయాలి
మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

పాలమూరు, మార్చి 17 : బీసీలకు ఇబ్బందిగా మారిన క్రీమీలేయర్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సర్కిల్‌ అధ్యక్షుడు జి.లింగంగౌడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమా వేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యుత్‌ భవన్‌ ఎదుట ఏర్పాటు చేసిన బీసీల జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, విక లాంగులు, ఎన్‌సీసీ, మహిళా రిజర్వేషన్లకు లేని క్రీమీలేయర్‌ కేవలం బీ సీలకే ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్‌ సంస్థలో బీసీ ఇంజనీర్‌లకు డైరెక్టర్స్‌, సీఎండీలుగా 50శాతం కోటా ఇవ్వాలన్నారు. విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న బీసీ ఉద్యోగులకు ఎఫ్‌వోసీఎఎల్‌ పోస్టుల్లో అవకాశం కల్పించాలన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యాంగపరమై, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీ లేవని అన్నారు. రాజ్యాంగబద్ధమైన మండల కమిషన్‌ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజ ర్వేషన్లు పెట్టాలని సిఫారసు చేసిందని గుర్తు చేశారు. పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ నాచియప్పన్‌ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం బీసీ ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పుఇచ్చిందన్నారు. అన్ని వైపుల నుంచి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫారసులున్నాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర స్థాయి ఉద్యోగాల్లో 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే బీసీ ఉద్యోగులు కేవలం 7.50లక్షల మాత్రమే ఉండటం శోచనీయ మన్నారు. దేశ జనాభాలో 56శాతం ఉన్న బీసీలకు 14 శాతం ప్రాతిని థ్యం మాత్రమే ఉందన్నారు.  ఇకపైన బీసీలపై వివక్ష, చిన్నచూపు చూడటం సరికాదన్నారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.కుమారస్వామి, యం.వెంకన్నగౌడ్‌, జి.బ్రహ్మేంద్రరావు, పి.యాదగిరి, సీహెచ్‌ చంద్రుడు, టి.నరేందర్‌, కృష్ణయాదవ్‌, అంజి, శివకుమార్‌, డీఈ బి.నవీన్‌కుమార్‌, బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-18T05:46:05+05:30 IST