కోటి మొక్కలు నాటడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-07T05:02:22+05:30 IST

జిల్లాలో కోటి మొక్కలు నాటడమే లక్ష్యమని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు.

కోటి మొక్కలు నాటడమే లక్ష్యం
మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

- అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ 

- నాటిన ప్రతీ మొక్కకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలి

- చందాపూర్‌ రోడ్డులో హరితహారం మొక్కలను నాటేందుకు స్థలాల పరిశీలన

వనపర్తి అర్బన్‌, జూలై6: జిల్లాలో కోటి మొక్కలు నాటడమే లక్ష్యమని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. బుధ వారం వనపర్తి పట్టణంలోని చందాపూర్‌ రోడ్డు లో హరితహారం మొక్కలను నాటేందుకు అను వైన స్థలాలను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావ రణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయా లని కోరారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు హరితహారం మొక్కలు నాటినట్లయితే సత్ఫలి తాలను ఇస్తుందని ఆయన సూచించారు. జిల్లా లోని 14 మండలాల్లో హరితహారం కార్యక్రమం కింద పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏ ర్పాటు చేశామన్నారు.  ప్రభుత్వ ఖాళీ స్థలా ల్లో, కార్యాలయాల ఆ వరణలో, పాఠశాల లు, కళాశాలల ప్రాంగ ణాలలో మొక్కలు విరివిగా నాటాలని, నాటిన ప్రతీ మొక్కల కు ట్రీగార్డుల ఏర్పా టు చేయాలని, ఎప్ప కటిప్పుడు పర్యవేక్షిం చాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచు లు, పంచాయతీ సెక్రటరీలు, సమష్టిగా కృషి చేసి మొక్కలు నాటాలని ఆయన అన్నారు.  కా ర్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బున్యాదిపురంలో..   

పెబ్బేరు రూరల్‌:  హరితహారం కార్యక్రమం లో భాగంగా మండల పరిధిలోని బున్యాదిపు రం, రంగాపురం గ్రామాల మధ్య రహదారి ప క్కల మొక్కలు నాటారు. అలాగే పాఠశాల ఆవ రణంలో ఖాళీ స్థలంలో 1000 మొక్కలు నాటా రు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, గ్రామ సర్పంచ్‌ గోవిందమ్మ, రంగాపురం సర్పం చ్‌ గట్టయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వనం రాములు యాదవ్‌, వార్డు సభ్యులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-07T05:02:22+05:30 IST