పరీక్షలు ప్రశాంతంగా రాయాలి

ABN , First Publish Date - 2022-05-24T04:43:50+05:30 IST

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికా రులను ఆదేశించారు.

పరీక్షలు ప్రశాంతంగా రాయాలి
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా 

వనపర్తి రూరల్‌, మే 23:  పదో తరగతి పరీక్షలు  ప్రశాంతంగా రాసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికా రులను ఆదేశించారు. సోమవారం వనపర్తి పట్ట ణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశా ల, లిటిల్‌ బర్డ్స్‌ పాఠశాలలను  కలెక్టర్‌ తనిఖీ చేశారు. అనూస్‌, సరస్వతి శిశు మందిర్‌, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నతపాఠశాల, కొత్తకోట పాఠ శాలలను జిల్లా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాల్లో 7,311 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉం డగా 7,230 మంది విద్యార్థులు మాత్రమే హాజర య్యారని తెలిపారు.  పరీక్ష కేంద్రాల్లో మొ బైల్‌ ఫోన్‌లను అనుమతించరాదని, విద్యార్థులు, ఇన్వి జిలేటర్లు కోవిడ్‌ నిబంధనలను పాటిస్తు మాస్కు ను తప్పకుండా ధరించాలని ఆమె సూ చించారు.  ప్రశ్నపత్రాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రత వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుం డా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచిం చారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్‌ కిట్లను ఏర్పా టు చేయాలని, విద్యార్థులు పరీక్షా సమయాన్ని  సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.  


Updated Date - 2022-05-24T04:43:50+05:30 IST