అంగరంగ వైభవంగా తెప్పోత్సవం

ABN , First Publish Date - 2022-12-07T22:58:17+05:30 IST

మల్దకల్‌ మండల కేంద్రంలో లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

- శేష వాహనంపై ఊరేగిన వేంకటేశ్వరస్వామి

మల్దకల్‌, డిసెంబరు 7 : మల్దకల్‌ మండల కేంద్రంలో లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం పం చామృతాభిషేకం, బలిహరణం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటలకు శ్రీదేవి భూ దేవి సమేతుడైన శ్రీనివాసుడిని విద్యుద్దీపాలతో అలంకరించిన హంసవాహనంలో ఉంచి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించడానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్ళనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డితో పాటు పండితులు మదుసూదనాచార్యులు, రమేశాచార్యులు, రవిఆచార్యులు, నాగరాజుశర్మ, ధీరేంద్రదాసులు, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రథోత్సవం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్‌, ఈవో తెలిపారు.

Updated Date - 2022-12-07T22:59:59+05:30 IST