ఉపాధ్యాయుడైన కలెక్టర్
ABN , First Publish Date - 2022-03-06T05:22:44+05:30 IST
నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వ హించే కలెక్టర్ ఉపాధ్యాయుడే పది విద్యార్థులను ప్రశ్నలు అడిగా జవాబులు రాబట్టారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మార్చి 5 : నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వ హించే కలెక్టర్ ఉపాధ్యాయుడే పది విద్యార్థులను ప్రశ్నలు అడిగా జవాబులు రాబట్టారు. నల్లబల్ల పై రాసి విద్యార్థును పలు అంశాలపై చ ర్చించారు. కలెక్టర్ వెం కట్రావు శనివారం ఆయన జిల్లా కేంద్రం లోని బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పది పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అంతకుముందు పాఠశాలలో హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. పాఠశాలలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్‌ను ఫోన్‌చేసి ఆదేశించారు. రానున్న పదో తరగతి వార్షిక పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని పాఠశాల హెడ్మాస్టర్‌ను ఆదేశిం చారు. విద్యార్థులు ఇప్పటి నుంచే కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలి
మహబూబ్ నగర్ (కలెక్టరే ట్), మార్చి 5 : అంగన్వాడీ కేం ద్రాల ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే స హించేది లేదని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. శనివారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో అంగన్వాడీ కార్యక్రమాల పై సమీక్ష నిర్వహించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలకు సంబంధించి సామ్, న్యామ్ కార్యక్రమాలపై సెక్టార్ల వారీగా, సఖీ సెంటర్, స్త్రీ హక్కులు, బాల నేరస్తు లు, బాల్యవివాహాలు తదితర అంశాలపై సమీక్షిం చారు. కొవిడ్ వల్ల తల్లిదండ్రులు కోల్పోర ుున పిల్లలకు పీఎం కేర్ కింద ఐసీపీఎస్ తరపున నిరంతర ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం హాజరయ్యారు.