పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-03-06T05:01:36+05:30 IST

జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పూర్తి చేసి, పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- అభివృద్ధి పనులపై సమీక్ష

గద్వాల క్రైం, మార్చి 5 : జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పూర్తి చేసి,  పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశపు హాలులో అదనపు కలెక్టర్‌ శ్రీహర్షతో కలిసి పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులతో పట్టణంలోని పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు బాధ్యత తీసుకొని పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, ఇంజనీర్‌లు, కాంట్రాక్టర్లు, ప్రతి మేజర్‌ పనులపై ప్రణాళిక వేసుకొని సమన్వయంతో పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఆర్‌టీసీ బస్టాండ్‌ నిర్మాణపనులు వేగవంతం చేసి, పనులలో పురోగతి సాధించాలన్నారు. అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ప్రారంభమౌతున్నందున గట్టు, కేటీ దొడ్డి, ధరూర్‌ మండలాలలోని  కేజీబీవీల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అత్యవసరంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు మార్చి చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మండలానికి ఒక సబ్‌ ఇంజనీర్‌ను ఏర్పాటు చేసి పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, పురోగతిలో ఉన్న పనులపై దృష్టి సారించాలన్నారు.  ధరూర్‌, కేటీ దొడ్డి, గద్వాల, అనంతపురం, శెట్టి ఆత్మకూర్‌ మండలాలలో జరుగుతున్న పీఎంజీఎస్‌వై పనులపై దృష్టి పెట్టాల న్నారు.  సమావేశంలో వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ హయాంలోనే పట్టణం అభివృద్ధి 

 గద్వాల టౌన్‌ :  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే  పట్టణాల రూపురేఖలు మారి పోయాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అ న్నారు.  సీఎం కేసీఆర్‌ చొరవతో, ముసిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణప్రగతి పథకం కింద పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. శనివారం పట్టణంలోని 30వ వార్డులో రూ.15లక్షలతో నిర్మించిన పట్టణ ప్రకృతి వనం పార్కును, రూ.20లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్మన్‌కు వార్డు కౌన్సిలర్‌ శ్రీరాములు పుష్పగుచ్ఛం అం దజేసి ఘన స్వాగతం పలికారు.    కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, ఎంపీ పీ విజయ్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ బాబర్‌,  ము నిసిపల్‌ కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌, టీఆర్‌ఎస్‌  పట్టణ అధ్యక్షుడు గోవిందు, కౌన్సిలర్లు శ్రీరాములు,  మురళి, దౌలు, శ్రీమన్నారాయణ, మహేష్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సుధాకర్‌, కృష్ణ, వీరేష్‌, కార్యకర్తలు, వార్డు ప్రజలు ఉన్నారు.  

Read more