అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-12-31T23:16:46+05:30 IST

అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రా మంలో చోటు చేసుకుంది.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
దాసరి మల్లేష్‌ (ఫైల్‌)

బిజినేపల్లి(నాగర్‌కర్నూల్‌ క్రైం), డిసెంబరు 31: అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రా మంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణఓబుల్‌రెడ్డి తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి మల్లేష్‌(42) డిసెంబరు 28న రాత్రి 12 గంటల ప్రాం తంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని భార్య నరస మ్మకు చెప్పి వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువుల ఇళ్లల్లో వెతికింది. ఆచూకీ తెలియకపోవడంతో బిజినేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమో దు చేసుకొని విచారణ చేస్తుండగా వట్టెం గ్రామ శివారులోని కేఎల్‌ఐ కాలువలో శవమై కనిపించాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2022-12-31T23:16:47+05:30 IST