విద్యార్థులు నవభారత నిర్మాతలు

ABN , First Publish Date - 2022-09-22T05:03:13+05:30 IST

నవభారత నిర్మాత లు విద్యార్థులేనని, వారిని చక్కగా తీర్చిదిద్దే బా ధ్యత ఉపాధ్యాయులదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులు నవభారత నిర్మాతలు
అనంతాపురంలో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీపీ

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- తన జన్మదినం సందర్భంగా సైకిళ్లు, నోట్‌ పుస్తకాల పంపిణీ


గద్వాల, సెప్టెంబరు 21: నవభారత నిర్మాత లు విద్యార్థులేనని, వారిని చక్కగా తీర్చిదిద్దే బా ధ్యత ఉపాధ్యాయులదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అ నంతాపురం గ్రామంలో బుధవారం తన జన్మ దినం సందర్బంగా విద్యార్థుల మధ్య కేక్‌కట్‌ చే శారు. అనంతరం విద్యార్థులకు సైకిళ్లు, నోట్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే దంపతులను ఎం పీపీ ప్రతాప్‌గౌడ్‌ గజమాలతో సత్కరించారు. జమ్మిచేడు పాఠశాలలో జములమ్మ ఆలయ చై ర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో విద్యార్థు లకు నోట్‌పుస్తకాలు, మెటీరియల్‌ను అందించా రు.  వీరాపురం పాఠశాలలో విధ్యార్థులకు నోట్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. జగదీశ్వర్‌రెడ్డి, శివ, అనిల్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 పేదల ఆకలి తీర్చేందుకే కేసీఆర్‌ క్యాంటిన్‌ 

గద్వాల టౌన్‌ : పేదల ఆకలి తీర్చడం కో సమే గద్వాలలో కేసీఆర్‌ క్యాంటిన్‌ ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందించే ఏర్పాటు చేశా మని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నా రు.  పట్టణంలోని పాత బస్టాండ్‌ సర్కిల్‌లో ఏ ర్పాటు చేసిన కేసీఆర్‌ క్యాంటిన్‌ను ప్రారంభిం చారు. అనంతరం మునిసిపల్‌ చైర్మ న్‌ బీఎస్‌ కేశవ్‌తో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విని యోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయం చైర్మ న్‌ జంబు రామన్‌గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వ రమ్మ, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీ టీసీ సభ్యులు, జమ్ములమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ సతీష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా, బాలసదనంలో ఎన్టీ ఆర్‌ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులతో  కలిసి ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతితో కలిసి విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు, ఆటవస్తువులు, స్టేషనరీ అందించి, వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. 24వ వార్డులో కౌన్సిలర్‌ శ్రీనుముదిరాజ్‌, ఎమ్మెల్యే చి త్రపటానికి క్షీరాభిషేకం చేసి మునిసిపల్‌ కార్మి కులకు దుస్తులు అందించారు. మూడో వార్డులో కౌన్సిలర్‌ గీతమ్మ నాగులూయాదవ్‌ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. వారికి నోట్‌ పుస్తకాలు, పెన్నులు అందించారు. 

Updated Date - 2022-09-22T05:03:13+05:30 IST