కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-07T23:18:24+05:30 IST

రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచా రాలు పెరుగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్య లు తీసుకోవాలని టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నందిమల్ల శారద డిమాండ్‌ చేశా రు.

కఠిన చర్యలు తీసుకోవాలి
అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

వనపర్తి టౌన్‌, డిసెంబరు 7: రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచా రాలు పెరుగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్య లు తీసుకోవాలని టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నందిమల్ల శారద డిమాండ్‌ చేశా రు. బుధవారం జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ను తన చాంబర్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రలో ఆడబిడ్డలకు, చిన్నారి బాలికలకు భద్రత, గౌర వం ఉంటాయనే ఆశలను నీరుగార్చుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్‌ దగ్గర పబ్‌ ఘటన, లైంగిక అక్రమ రవాణ వంటి అనేక అఘాయిత్యాలతో నేడు పాఠశాలకు వెళ్లిన చిన్నారి, ఉద్యోగానికి వెళ్లిన యువతి, మార్కెట్‌కు వెళ్లిన మహిళ క్షేమంగా ఇంటికి తిరి గొస్తారనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. గడిచిన 8 సంవత్సరాల్లో పోక్సో కేసులు మూడు రెట్లు పెరిగాయని, దళిత మహిళలపై అత్యాచారా ల్లో రాష్ట్రం 5వ స్థానంలో, గిరిజనులపై జరుగుతున్న అత్యా చారాల్లో 6వ స్థానంలో ఉండటం ఇందుకు అద్దం పడుతున్నాయని అన్నారు. మూడేళ్లలో 57పైగా మహిళల పై జరిగిన నేరాల కేసులు, చిన్నారులపై దాడులు 14 వేల కు పైగా జరగడం ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఏరులై పారడం, గంజాయి అక్రమ రవాణా, వినియోగం, డ్రగ్స్‌ మాఫియా ఆగడాలు పెరిగి పోవడం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నాయని వి మర్శించారు. వీటన్నింటికి అడ్డు కట్ట వేసేలా చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకుల నందిమల్ల అశోక్‌, బాలరాజు, బాలునాయుడు, లక్ష్మన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:18:26+05:30 IST