వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-05T04:39:58+05:30 IST

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నారాయణపేట పట్టణంలోని వివిధ దేవి ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో దర్శనమిచ్చారు.

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
కోటకొండలో దుర్గాదేవిగా అమ్మవారు

నారాయణపేట, అక్టోబరు 4 : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నారాయణపేట పట్టణంలోని వివిధ దేవి ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో దర్శనమిచ్చారు. అశోక్‌నగర్‌ మల్లాంబిక ఆలయంలో రాజరాజేశ్వరి దేవీగా అమ్మవారు దర్శనమివ్వగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తిపీఠంలో లక్ష్మి అమ్మవారు, అశోక్‌నగర్‌లోని గజలమ్మ దేవి ఆలయంలో, బ్రాహ్మణవాడీ ఆలయంలో చౌడేశ్వరిమాత మహిషాసుర మర్థినిగా దర్శనమిచ్చారు. అంబాభవాని ఆలయంలో భవాని మాత తుల్జాభవానిగా, కాళికదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నారాయణపేట బ్రహ్మణ్‌వాడీ చౌడేశ్వరి ఆలయంలో ల యన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ డిస్టిక్‌ గవర్నర్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మర్‌ హరినారాయణ భట్టడ్‌ సరిత దంపతులు మంగళ వారం రాత్రి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలు వాతో వైస్‌ చైర్మన్‌ దంపతులను సత్కరించారు. 

నారాయణపేట రూరల్‌ : మండలంలోని సింగారం, కోటకొండ గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కోటకొండ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. సింగారం శ్రీగిరి పీఠం భవానిమాత మహిషాసురమర్దినిగా దర్శ నమిచ్చారు. కొల్లంపల్లి, కోటకొండ నర్సాచలం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. 

మక్తల్‌ :  మక్తల్‌ పట్టణంలో దేవీనవ రాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత మంగళవారం మహిషాసురమర్దిని దేవిగా భ క్తులకు దర్శనం ఇచ్చారు.  ఆలయం వద్ద గణపతి పూజ, కలశపూజ, పూర్ణాహుతి, చండీహో మం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగించారు. అలాగే వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని గజ వాహనంపై ఊ రేగించారు. నల్లజానమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరనలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్ట సురేష్‌కుమార్‌ గుప్తా, ఆలయ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ గుప్తా, బి.భాస్కర్‌, మన్సాని వెంకటేష్‌, జగదీష్‌ గుప్తా, పొర్ల వెంకటేష్‌, వట్టం రతన్‌కుమార్‌ గు ప్తా, కట్ట శ్రీనివాసులు, సురేష్‌, నరేష్‌, రంజిత్‌,  రంగనాథ్‌, రాకేష్‌, స్వామి, వడ్వాట్‌ వెంకటేష్‌, బుచ్చయ్య, హరి కృష్ణ, గుబ్బ నర్సిములు, మహిళా సంఘం సభ్యులు కొత్త మీరాభాయ్‌, విజయలక్ష్మి, పద్మ, ఉషారాణి, అశ్విని, అనిత, ప్రసన్న, సృజన, గార సంధ్య పాల్గొన్నారు. 

మాగనూరు : మాగనూరు మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో కాళికా ఆలయంలో మంగళవారం దుర్గాదేవికి వేదమంత్రాల మధ్య పంచామృతాభిషేకం, జలాభిషేకం అనంతరం పూలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వాహన యజమానులు తమ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు సోమవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మహిళలకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మెమోంటో, శాలువాతో సత్కరించారు. మహాలక్ష్మి, జ్యోతి, నర్సమ్మ, ఇందిరమ్మ, సుజాత, సరస్వతి పాల్గొన్నారు.

కోస్గి : మునిసిపాలిటీ పరిధిలోని వికాస్‌నగర్‌ కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆధ్మాతిక పాటలు, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విస్లావత్‌ రాములు, గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కేశవులు, సహాయ కార్యదర్శి ఎన్‌.సాయప్ప, ట్రైజరర్‌ శ్రీనాథ్‌, టి.రాజేందర్‌రెడ్డి, నారాయణనాయక్‌, పరంధాములు, శంకరప్ప పాల్గొన్నారు. 
Read more