-
-
Home » Telangana » Mahbubnagar » Rural development work should be completed in a timely manner-MRGS-Telangana
-
పల్లె ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-01-18T05:11:36+05:30 IST
గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష సిబ్బందిని ఆదేశించారు.

- అదనపు కలెక్టర్ శ్రీహర్ష
- కేటీ దొడ్డి మండలంలో పర్యటన
కేటిదొడ్డి, జనవరి 17 : గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష సిబ్బందిని ఆదేశించారు. కేటిదొడ్డి మండలంలోని గంగన్‌పల్లి, వెంకటాపురం, కుచినెర్ల గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి పల్లెల్లో పారిశుధ్య పనులకు సంబం ధించి పలు సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన అదనపు కలెక్టర్, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పారిశుధ్య పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. అనంతరం నర్సరీలను పరిశీలించి వర్షాకాలం ఆరంభమయ్యే నాటికి మొక్కలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో పాండు, ఎంపీవో సయ్యద్‌ఖాన్, ఏపీవో కుమార్ ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.