గ్రామీణ సంస్కృతిక నిలయాలు వారం సంతలు

ABN , First Publish Date - 2022-10-08T04:49:57+05:30 IST

ప్రాచీన గ్రామీణ సంస్కృతికి నిలయాలు వారం సంతలు అని మక్తల్‌ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

గ్రామీణ సంస్కృతిక నిలయాలు వారం సంతలు
బిజ్వార్‌లో పశువుల సంతను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం

-  మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

- బిజ్వార్‌లో పశువుల సంత ప్రారంభం


ఊట్కూర్‌, అక్టోబరు 7: ప్రాచీన గ్రామీణ సంస్కృతికి నిలయాలు వారం సంతలు అని మక్తల్‌ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన వారం పశువుల సంతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వారం సంతల వల్ల ప్రజలకు అన్నిరకాల అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ సంస్కృతిని రాబోయే తరాలకు కూడా తెలియజేయాలన్నారు.  వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు లాంటి యంత్రాలు  రావడంతో పల్లెల్లో పాడిపశువుల పెంపకం తగ్గింద ని, పశువుల పేడతో సేంద్రియ వ్యవసాయం చేసు కుంటేనే ఆరోగ్యంగా ఉంటామనే విషయాన్ని గుర్తిం చాలన్నారు. రైతులు సెంద్రియ పద్ధతిలో ఆహార ధాన్యాలను పండించాలన్నారు. గ్రామంలో పల్లెదవాఖా న, సంత భవనంతో పాటు, ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. బిజ్వార్‌ను ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాల న్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ ఎల్లాగౌడ్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సర్పంచ్‌ సావిత్రమ్మ, ఎంపీటీసీ సభ్యు రాలు హన్మమ్మ, ఉపసర్పంచ్‌ పొర్ల నర్సిములు, పంచాయతీ కార్యదర్శి మంజుల, వార్డు సభ్యులు గోవర్దన్‌, మల్లేశ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రజాపంఽథా పార్టీ  డివిజన్‌ కార్యదర్శి సలీం, మాజీ సర్పంచ్‌ కృష్ణారెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, హన్మిరెడ్డి, సిద్దు, తిరుపతి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:49:57+05:30 IST