గొడవలు చేస్తే రౌడీషీట్
ABN , First Publish Date - 2022-09-04T04:44:07+05:30 IST
జిల్లాలో జరగబోయే గణేష్ నిమజ్జనోత్స వాల సందర్భంగా ఎవరైన గొడవలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ పెడతామని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.
- 24 గంటల్లో గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలి
- నిమజ్జనోత్సవాలకు పోలీసులతో పాటు 200 మంది వలంటీర్లు
నారాయణపేట క్రైం, సెప్టెంబరు 3 : జిల్లాలో జరగబోయే గణేష్ నిమజ్జనోత్స వాల సందర్భంగా ఎవరైన గొడవలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ పెడతామని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. 24 గంటల్లోపు నిమజ్జనోత్స వాలను ముగించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ప్రత్యేక పోలీస్ బం దోబస్తుతో పాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 200 మంది వలంటీర్లచే బం దోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రార్థనా మందిరాలు, సమస్యాత్మ క ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక మా ద్యమాల్లో రెచ్చగొట్టే అన్య మతాలను అగౌరవపరిచేలా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాల ద్వారా నిమజ్జనోత్సవాలను పర్యవేక్షించడం జరుగుతుందని, ఆకతాయిలను గుర్తించేందుకు షీటీం, ఐడీ పార్టీ పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలనీల్లో దొంగతనాల నివారణపై ప్రత్యేక బృందంను ఏర్పాటు చేశామన్నారు. ఊట్కూరులో ఈనెల 7, 8వ తేదీల్లో, పేటలో 10, 11 తేదీల్లో, మక్తల్‌లో 11, 12 తేదీల్లో నిమజ్జన వేడుకలు ఉంటా యని తెలిపారు. డీఎస్పీలు కె.సత్యనారాయణ, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.