ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు నమోదు చేసుకోండి

ABN , First Publish Date - 2022-10-18T04:41:25+05:30 IST

ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందకు వచ్చే నెల 7లోగా అర్హులైన ఉ పాధ్యాయులందరు ఓటు నమోదు చేసుకో వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామ రావు అన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు నమోదు చేసుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సీతారామరావు

- రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సీతారామరావు 

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం అక్టోబరు 17 :  ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందకు వచ్చే నెల 7లోగా అర్హులైన ఉ పాధ్యాయులందరు ఓటు నమోదు చేసుకో వాలని  రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామ రావు అన్నారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరునమోదు పై ఉపాధ్యాయ సంఘాల నాయకుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ కె.సీతా రామరావు మాట్లాడుతూ అర్హత ఉన్న ఉపాధ్యాయులందరూ వచ్చేనె ల 7లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరా బాద్‌ ఉపాధ్యాయ నియోజక వర్గపరిధిలోని ఆరు సంవత్సరాలు నివాసం ఉన్నవారు అర్హులని,  గుర్తింపు పొందిన విద్యాసంస్థలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేసి ఉండాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయు లతో ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.  సమావేశంలో ఆర్డీవో అనిల్‌కుమార్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T04:41:25+05:30 IST