మహ్మదాపూర్‌లో బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2022-05-16T04:48:42+05:30 IST

మండలంలోని మహ్మదా పూర్‌ గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్‌రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు.

మహ్మదాపూర్‌లో బండలాగుడు పోటీలు
బండలాగుడు పోటీలు ప్రారంభిస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

- అంతర్‌రాష్ట్ర పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి జూపల్లి 

- విజేతగా నిలిచిన వనపర్తి జిల్లా ఎద్దులు 


పాన్‌గల్‌, మే 15: మండలంలోని మహ్మదా పూర్‌ గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్‌రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతగా వన పర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన దర్శకుమార్‌రెడ్డి ఎద్దులు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతకు ముందు ఉదయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించి, కాసేపు తిలకించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో మొదటి బహుమతి సాధించిన కొప్పునూరు గ్రామానికి చెందిన దర్శకుమార్‌రెడ్డి ఎద్దులకు రూ.50వేలు, రెండవ బహుమతిగా పెద్దదగడ గ్రామం వనపర్తి జిల్లా సగర సం ఘం అధ్యక్షుడు తిరుపతయ్యసా గర్‌కు రూ.40వేల నగదును అంద జేశారు. నంద్యాల జిల్లా కొత్తకోట కు చెందిన డాక్టర్‌ గురునాథ్‌కు చెందిన ఎద్దులు తృతీయస్థానంలో నిలిచాయి. దీంతో ఆయనకు రూ.30వేల నగదును కురుమూర్తి సాగర్‌ అందించారు. నాల్గవ స్థానంలో నంద్యాల జిల్లా సయ్యద్‌ కలాంపాషాకు చెందిన ఎద్దులు నిలువగా, ఆయనకు రూ.20వేల నగదును వెంకటేష్‌సాగర్‌ అందించారు. పాన్‌గల్‌ మండలం మందాపూర్‌కు చెందిన పుచ్చల పరమేశ్వర్‌రెడ్డికి చెందిన ఎద్దులు ఐదవ స్థానం లో నిలిచాయి. ఆయనకు రూ.10వేల నగదు బహుమతిని మందాపూర్‌ నాగేంద్రం అందించా రు. పోటీలను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు చింతలపల్లి జగదీశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ జయ రాములుసాగర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ స్థులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-16T04:48:42+05:30 IST