కనుల పండువగా రథోత్సవం

ABN , First Publish Date - 2022-12-09T23:13:12+05:30 IST

మల్దకల్‌ మండల కేంద్రంలో వెలసిన స్వయంభువు లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన రథోత్సవం కనుల పండువగా కొనసాగింది.

కనుల పండువగా రథోత్సవం
రథోత్సవానికి హాజరైన భక్తులు

- వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు -

వేలాదిగా తరలివస్తున్న భక్తులు

మల్దకల్‌, డిసెంబరు 9 : మల్దకల్‌ మండల కేంద్రంలో వెలసిన స్వయంభువు లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన రథోత్సవం కనుల పండువగా కొనసాగింది. రాత్రి ఒంటి గంట నుంచి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఉత్స వం కొనసాగింది. అంతకుముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్ర మానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా భక్తులు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతీ రోజు నిర్వహిస్తున్న సాంసృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు భక్తులకు అందిస్తున్న సేవలు ప్రశంసలందుకుంటున్నాయి. శుక్రవారం కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనా నికి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.న్నారు.

Updated Date - 2022-12-09T23:13:14+05:30 IST