బాధిత మహిళల సహాయంలో వేగంగా స్పందించాలి

ABN , First Publish Date - 2022-11-16T23:22:51+05:30 IST

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధిత మహిళలకు సహా యం అందించడంలో వేగంగా స్పందించాలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌ సూచించారు.

బాధిత మహిళల సహాయంలో వేగంగా స్పందించాలి
మాట్లాడుతున్న నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌

- నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌

జడ్చర్ల, నవంబరు 16 : పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధిత మహిళలకు సహా యం అందించడంలో వేగంగా స్పందించాలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌ సూచించారు. జడ్చర్లలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో రాష్ట్ర పోలీసు ఉమెన్‌ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా బుధవారం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాధరణకు గురైన మహిళలకు సహాయం అందించే అవకాశాన్ని అదృష్టంగా భావించాలని సూచించారు. సాధారణ ప్రజలు సమస్యల్లో ఉన్న సందర్భంలో పోలీసులు గుర్తుకురావడం సహజమ న్నారు. ఆధునిక సమాజంలో మహిళలపై జరుగు తున్న నేరాలను గమనిస్తూనే ఉన్నామని, నిందితులకు కఠినశిక్ష పడడంతో నేరగాళ్లలో భయం కలిగించిన వారమవుతామన్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర పోలీసు ఉమెన్‌ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, ఉమెన్‌ సేఫ్టీ విభాగం అదనపు ఎస్పీ రామ్‌కుమార్‌, డీఎస్పీ మధు, రిసోర్స్‌ పర్సన్‌ రవి, సతీష్‌, ఉమ్మడి జిల్లాలోని ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్‌ఐలు, రిసెప్షన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:22:54+05:30 IST