రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2022-08-21T05:13:04+05:30 IST
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు.
- జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి
మహబూబ్‌నగర్, ఆగస్టు 20 : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో ప్రధాని బాధ్య తలు చేపట్టిన ఆయన శాస్త్ర, సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు నడిపిం చారన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటుహక్కును కల్పించిన ఘనత రాజీవ్‌దేనని అన్నారు. ఆయన ఆశయసాధనకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న ఆయనను సంఘవిద్రోహులు తుదముట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, వినోద్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, సీజే బెనహర్, జహీర్ అక్తర్, లక్ష్మణ్‌యాదవ్, సిరాజ్‌ఖాద్రి, సాయిబాబ, మల్లు నర్సింహారెడ్డి, అన్వర్‌పాషా, బంగ్లా రవి, నాగరాజు, సాదిక్, వెంకటయ్య, సుభాష్‌ఖత్రి, అవేజ్, అజ్మత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
యువత పక్షపాతి రాజీవ్‌గాంధీ
బాదేపల్లి : దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ యువజన, మహిళల పక్షపా తి అని మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిచారు. కార్యక్రమంలో నాయకులు నిత్యానందం, అశోక్, శ్రీధర్‌రెడ్డి, అనుప కృష్ణయ్య, ఉమాయిన్, విజయభాస్కర్‌రెడ్డి, రాఘవేందర్, ఆనంద్, రఘు, శ్రీనివాస్ యాదవ్, నసీర్, ఆసిఫ్, పరసవేది, బాలు, రవినాయక్ పాల్గొన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
మహమ్మదాబాద్ : రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్న ఆయ న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయ ణ, ప్రధాన కార్యదర్శి బి.అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచులు ఫాల్గున నాయక్, రాజేశ్వర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగయ్య, నాయకుల అరంవింద్‌రెడ్డి, అనంతయ్యగుప్త, బాలము కుందం, శంకర్‌నాయక్, మైబయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఆనంద్, కృష్ణయ్య పాల్గొన్నారు.