కాజ్‌వేకు రెయిలింగ్‌ను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-10-18T04:25:10+05:30 IST
మండలంలోని ఊకచెట్టు వాగు కాజ్‌వేకు రెయిలింగ్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మదనాపురం, అక్టోబరు 17 : మండలంలోని ఊకచెట్టు వాగు కాజ్‌వేకు రెయిలింగ్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రెయిలింగ్ కోసం ఎమ్మెల్యే నిధులు, కలెక్టర్ నిధుల నుంచి మొత్తం రూ. 13 లక్షలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సంద ర్భంగా సోమవారం రెయిలింగ్ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. మొదట వాగుకు ఎడ మవైపు రెయిలింగ్‌ను ఏర్పాటు చేసిన తరువాత రెండోవైపు చేయాలని అధికారులకు సూచించారు. నూతన బ్రిడ్జికి త్వరగా టెండర్లను పిలిచి పనులను ప్రారంభిస్తామని అన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బిట్లియాదగిరి ఉన్నారు.