ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-08-18T04:32:44+05:30 IST
కరోనా వల్ల ఆర్థిక ఇ బ్బందులు ఏర్పడినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర జా సంక్షేమమే ధ్యేయంగా పథకాలను చేపడు తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
- విద్యతోనే సమాజాభివృద్ధి
- జడ్పీచైర్మన్ లోకనాథ్‌రెడ్డి
- లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ
వీపనగండ్ల, ఆగస్టు17: కరోనా వల్ల ఆర్థిక ఇ బ్బందులు ఏర్పడినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర జా సంక్షేమమే ధ్యేయంగా పథకాలను చేపడు తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. బొల్లారం గ్రామానికి మంజూ రైన 48 కొత్త పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే కల్యాణలక్ష్మి చెక్కులు, పౌష్టికా హారం కిట్లను కిశోర బాలికలకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ జూరాల చివరి ఆయకట్టు రైతుల కష్టాలు తొలగించేందుకు గోపల్‌దిన్నె- సింగోటం రిజర్వా యర్ల అనుసంధాన కాల్వ పనులు జరుగుతు న్నాయన్నారు. వీపనగండ్లలో కోర్టు ఏర్పాటుకు కృషి చేయాలని పండ్ల తోటల పెంపకం అధి కంగా ఉన్నందున హర్టికల్చర్ కార్యాలయం ఏర్పాటు చేసి రైతులకు ప్రయోజనాలు కల్పిం చాలని ఎంపీపీ కమలేశ్వరరావు, సర్పంచు నర సింహరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య ఎమ్మెల్యేను కోరారు. విద్యతోనే సమా జాభివృద్ధి చెందుతుందని, ప్రతీ ఒక్కరు చదువు కోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి అన్నారు. సోమశిల సిద్దే శ్వరం బ్రిడ్జి తరువాత ఈ ప్రాంతం పారిశ్రా మికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. స మావేశంలో తహసీల్దార్ పాండు నాయక్, ఎం పీడీవో కథలప్ప, గ్రామాల సర్పంచులు, ఎం పీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్య నారాయణగౌడ్, కురుమయ్య పాల్గొన్నారు.
చిన్నంబావి మండలంలో..
చిన్నంబావి: మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్, మండల ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామని ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధ వారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ ఆధ్వర్యంలో అ మ్మాయిపల్లి, అయ్యవారిపల్లి గ్రామాలకు చెం దిన 48మంది లబ్ధిదారులకు మంజూరైన పిం ఛన్ కార్డులు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే 13మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 15మందికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీలను అందజేశారు. కా ర్యక్రమంలో జడ్పీటీసీ కేసిరెడ్డి వెంకట రమ ణమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈద న్న యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ ఎస్ నాయకులు కేసిరెడ్డి చిన్నారెడ్డి, గోవింద్ శ్రీధర్‌రెడ్డి, జయగౌడ్, ప్రజలు పాల్గొన్నారు.