ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-10-18T04:38:47+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రజావాణి కార్యక్ర మం లో విన్నవించుకుంటున్న ఫిర్యాదులను (ప్రజా ఫిర్యాదులు) వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఎస్‌. వెంక ట్రావు ఆదేశించారు.

ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌, కలెక్టరేట్‌, అక్టోబరు 17: జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రజావాణి కార్యక్ర మం లో విన్నవించుకుంటున్న ఫిర్యాదులను (ప్రజా ఫిర్యాదులు) వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఎస్‌. వెంక ట్రావు ఆదేశించారు. సోమవారం రెవెన్యూ సమా వేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో  కలెక్టర్‌ పాల్గొని ప్రజల నుంచి నేరుగా 116  ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలపై ప్రజలు విన్న వించుకుంటున్న ( ఫిర్యాదులను) వినతులపై సం బంధిత శాఖ అధికారికి సీరియస్‌నెస్‌ ఉండాలని సూచించారు. ఇకపై పెండింగ్‌లను సహించేంది లేదని కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులను హెచ్చరించారు. కాగా, తన సాగుభూమి ఇతరులు ఆక్రమించారని, తనకు ఇప్పించాలని సీసీకుంట మండలం ఉద్యాల గ్రామానికి చెందిన వీరన్న కో రారు. తన సమస్యను విన్నవించుకునే క్రమంలో భాగంగా ఆయన  వరుస క్రమంలో నిలబడ్డాడు. వీరన్నకు మూర్చ రావడంతో ఒక్కసారిగా ఉన్న దగ్గరే కుప్ప కూలిపోయాడు. పోలీసులు గమనిం చి తక్షణమే అంబులెన్సూను రప్పించి  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

పత్తిపంటలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : పత్తి పంటలో నా ణ్యత ప్రమాణాలు తప్పని సరి అని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. మార్కెటింగ్‌ శాఖ అధి కారులు పత్తిపంట నాణ్యత ప్రమాణాలు, మ ద్దతుధర, ఇతర వివరాలపై రూపొందించిన వాల్‌ పోస్టర్‌ను  సోమవారం కలెక్టర్‌ రెవెన్యూ హాలులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, ప్రత్యేక కలె క్టర్‌ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్‌ కుమార్‌, జడ్పీ సీఈవో జ్యోతి, మార్కెట్‌ అధికారులు పాల్గొన్నారు. 

 హరీశ్‌ను అభినందించిన కలెక్టర్‌

మహబూబ్‌ నగర్‌ కలెక్టరేట్‌ : జిల్లాకు చెందిన అంధ దివ్యాంగుడు హరీశ్‌ కుమార్‌ దివ్యాంగ సాహిత్యంపై తెలుగులో గోల్డ్‌ మెడల్‌ సాధించడం గర్వకారణమని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు.  సోమవారం రెవెన్యూ సమావేశమందిరంలో కలెక్టరేట్‌లో హరీశ్‌కుమార్‌ను అభినందిస్తూ సన్మానించి జ్ఞాపికతో సత్కరించి అభినందించారు.

Updated Date - 2022-10-18T04:38:47+05:30 IST