ప్రతిష్టాత్మకంగా జిల్లా వాలీబాల్‌ అకాడమీ

ABN , First Publish Date - 2022-11-24T23:49:58+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగాన్ని పటి ష్టం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతిష్టాత్మకంగా జిల్లా వాలీబాల్‌ అకాడమీ
అయ్యప్ప దర్శనం చేసుకుంటున్న మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

- డిసెంబరు 1 నుంచి వాలీబాల్‌ అకాడమీ క్రీడాకారుల ఎంపిక

- ఆబ్కారి, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, నవంబరు 24 : తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగాన్ని పటి ష్టం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేస్తు న్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలీబాల్‌ అకాడమీని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసెంబరు 1 నుంచి వాలీబాల్‌ అకాడమీ కోసం క్రీడాకారుల ఎంపిక జరుగు తుందని, అర్హులైన క్రీడాకారులు అకాడమీ ఎంపికలకు హాజరు కావాలని కోరారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు లోపు బాలబాలికలు హాజరు కావాలని, మెరుగైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను అధికారులు ఎంపిక చేస్తారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని, క్రీడాకా రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్తీకమాస ఉత్సవాలలో పూజలు చేసిన మంత్రి

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ వీరన్నపేట వీరభద్రకాలనీ పవనపుత్ర ఆంజనేయస్వామి దేవాలయంలో త్రయంబకేశ్వర స్వామి దేవాల యంలో గురువారం నిర్వహించిన కార్తీకమాస ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమ్మరివాడలోని శ్రీ వీరాంజనేయస్వామి కార్తీక అమావాస్య ఉత్సవాల ఊరేగింపునకు హాజరై పూజలు చేశారు. అదేవిధంగా న్యూగంజ్‌లోని లారీ అసోసియేషన్‌ కార్యాలయం సమీపంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ అనే భక్తుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చొరవ వల్లే తను ప్రాణాలతో ఉన్నానని, హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయడం వల్లే ఇప్పుడు అయ్యప్ప పూజ చేస్తున్నానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌చైర్మన్‌ గణేష్‌, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, శివరాజు, కె రాములు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:49:58+05:30 IST

Read more