అతిసారపై ముందస్తు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-06-14T05:02:22+05:30 IST

వచ్చే వర్షాకాలం అతిసార వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వెంకట్రావు అధికా రులను ఆదేశించారు.

అతిసారపై ముందస్తు చర్యలు చేపట్టాలి
పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ద్రావనాన్ని తాగిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకట్రావు

- అతిసార నియంత్రణ పక్షోత్సవాలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) జూన్‌ 13: వచ్చే వర్షాకాలం అతిసార వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వెంకట్రావు అధికా రులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సంజయ్‌నగర్‌లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అతిసార నియంత్రణ పక్షోత్సవాలను ఆ యన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్నది వర్షాకాలం కావడంతో అతిసార వ్యాధి ప్రబలే అవకాశాలు ఉన్నందునా దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది అతిసార నియంత్రణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా జిల్లాలో ఈనెల 13 నుంచి 27 వరకు అతిసారపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ముందుగా 5 సంవత్సరాలలోపు పిల్లలు, విద్యార్థులు ఈ అతిసార బారిన పడకుండా ముం దస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే వర్షాకాలం ఇళ్ల మధ్యలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, వాటి వలన మంచినీరు కలుషితమై అతిసార వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ప్రతీ పీహెచ్‌సీ, అర్బన్‌ హెల్త్‌ సెంట ర్లలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించా రు. అనంతరం పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ద్రావనాన్ని తాగించారు.   కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, డీఐవో డాక్టర్‌ శంకర్‌, డీఎంవో డాక్టర్‌ విజయ్‌కుమార్‌, యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రగతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-14T05:02:22+05:30 IST