క్రీడలతో శారీరక దృఢత్వం
ABN , First Publish Date - 2022-10-18T04:22:17+05:30 IST
క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
వనపర్తి రూరల్, అక్టోబరు 17: క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మర్రికుంట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ జోనల్ స్థాయి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రెసిడెన్షియల్ పాఠశాలల క్రీడా పోటీలను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలు కావాలని అన్నారు. ప్రతీ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో మన దేశం నుంచి అతి తక్కువ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతీ పాఠశాలలో క్రీడాకారులను ప్రోత్స హిస్తు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులోకి ఉన్నత విద్య
పెద్దమందడి : జిల్లాకు ప్రభుత్వ విద్యా సంస్థల రాకతో పేదవారికి ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండ లంలోని వెల్టూరు గ్రామానికి మంజూరైన బాలికల గురు కుల విద్యాలయాన్ని ఎంపీ రాములు, జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు అనేక విద్యా సం స్థలు వస్తున్నాయని, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలకు అనుబంధంగా 600 పడకల ఆసుపత్రి ఏర్పాటు కాబోతుందన్నారు. వనపర్తిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ కళాశాల, పశువైద్య కళాశాల, ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వెల్టూరు గురుకుల పాఠశాలను అన్ని రకాల వసతుల తో నిర్మిస్తామన్నారు. ముందరి తండా సర్పంచు జయంతి అధ్యక్షతన మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు ఎఫ్‌పీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వెల్టూరు సర్పంచు శ్రీనివాస్‌రెడ్డి, ముందరి తండా సర్పంచు జయంతి, వీరయ్య, రైతు సమితి అధ్యక్షుడు రాజప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ మన్యపురెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.