దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-10-01T04:58:04+05:30 IST

రాష్ట్రంలోని ప్రజలందరూ దుర్గామాత ఆశీస్సులతో సుభి క్షంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావు ల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడుావుల చంద్రశేఖర్‌రెడ్డి

-రాజా కృష్ణదేవరావునుసన్మానించిన రావుల

-   దుర్గామాతకు ప్రత్యేక పూజలు

వనపర్తి టౌన్‌, సెప్టెంబరు 30: రాష్ట్రంలోని ప్రజలందరూ దుర్గామాత ఆశీస్సులతో  సుభి క్షంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావు ల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వనపర్తి సంస్థానాధీశులైన రాజా కృష్ణదేవరావును తన అథితిగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. రాజా కృష్ణదేవరావుతో పాటు నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్‌ పంచి ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రా వుల మాట్లాడుతూ సంస్థానాధీశుల కాలం నుంచి వనపర్తిలో విజయదశమి సందర్భంగా రాజుల వంశస్థులు తొమ్మిది రోజుల పాటు వనపర్తిలోనే ఉంటూ  దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దసరా పం డుగ రోజు శమీ వృక్షానికి పూజలు నిర్వహించి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీగా వస్తుందన్నారు.   అనంతరం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం కన్యకా పర మేశ్వరి దేవాలయంలో, 22, 23వ వార్డు సింహ సేన యూత్‌ ఆహ్వానంతో ఆయా మండపాల దగ్గర ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు స మృద్ధిగా కురిసి జిల్లా ప్రజలు సుఖ సంతో షాలతో ఆరోగ్యంగా ఉండాలని రావుల అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం ఇటీవల మృతి చెందిన గొల్ల రాములు కుటుంబంతో పాటు పలువురిని వారివారి నివాసంలో కలిసి పరమర్శించారు. దాచ లక్ష్మయ్య కళ్యాణ మండపంలో పెద్దమందడి మండలం జగత్‌పల్లి గ్రామ టీడీపీ నాయకుడు కూతురు ఫంక్షన్‌లో పాల్గొని సహపంక్తి భోజ నం చేశారు.  కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బొలమోని రా ములు, అచ్యుతా రామారావు, నందిమల్ల అశో క్‌, వెంకటయ్య యాదవ్‌, సయ్యద్‌ జమీల్‌, రవి యాదవ్‌, ఎండీ గౌస్‌, దస్తగిరి, ఆవుల శ్రీను, బాలు నాయుడు, ఖాధర్‌, చిన్నయ్య యాదవ్‌, హోటల్‌ బాల్‌రాం, బండారు గోపాల్‌, మేదరి బాలయ్య, 222 అంజి, కొత్తగొల్ల శంకర్‌, అనీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-10-01T04:58:04+05:30 IST