అధికారులు జవాబుదారితనంతో పని చేయాలి
ABN , First Publish Date - 2022-07-07T04:52:10+05:30 IST
సమస్యలను పరిష్కరించడంతో అధికారులందరు జవాబుదారితనంతో పని చేయాలని ఎంపీపీ ఎల్కోటీ లక్ష్మి పేర్కొన్నారు.
- మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి
- సమస్యల వారిగా చర్చించిన మండల సభ
ఊట్కూర్, జూలై 6 : సమస్యలను పరిష్కరించడంతో అధికారులందరు జవాబుదారితనంతో పని చేయాలని ఎంపీపీ ఎల్కోటీ లక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ఊట్కూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరవేసే బాధ్యత అధికా రులదేనని, గ్రామ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి అధ్వానంగా తయారైందని పలువు సభ్యులు ప్రశ్నించారు. ఐసీడీఎస్ అధికారులు విధులకు రావడం లేదన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పనితీరు మార్చుకోవాలని ఎంపీపీ లక్ష్మి సూచించారు. తహసీల్దార్ తిరుపతయ్య మాట్లాడుతూ ఈనెల 20వరకు రేషన్ కార్డుల్లో ఉన్న తప్పులను సరిచేసుకునేందు అవకాశం ఉందని తెలిపారు. పీఎం కిసాన్ డబ్బులు రైతుల రావడం లేదని, అర్హులైన వారికి అందెలా చూడాని, అలాగే బోరు బావులు లేని వారికి సైతం ఉచిత కందులను పంపిణీ చేశారని ఎంపీటీసీ సభ్యడు హన్మంతు కోరగా ఎమ్మెల్యే సమక్షంలోనే రైతులకు కందులు పంపిణీ చేశామన్నారు. ఇరిగేష్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చెరువులు మరమ్మతుకు నోచుకోవడం లేదని ఐబీ ఏఈ వెంకటేష్‌పై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసిన సభ్యులు స్పందించడం లేదన్నారు. వర్షా కాలంలో చెరువులు మరమ్మతు జరిగేలా చూడాలని ఎంపీపీ సూచించారు. ఎంఈవో వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను ప్రారంభించడంతో ఈ సారి 1000 మంది విద్యార్థులు చేరారని అన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా 16 పాఠశాలల్లో పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రసవ గదిలో కరెంటు సరిగ్గా లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఊట్కూర్ సర్పంచ్ సూర్యప్రకాష్‌రెడ్డి ప్రశ్నించగా జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌గౌడ్ మాట్లాడుతూ ఆసపత్రి అభివృద్ధికి ఐదు లక్షల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పశువైద్యాధికారి మహాదేవ్ పశువులకు గాలికుంటు టీకాలు వేయడంతో పాటు కుక్కకాటు మందు కూడా అందుబాటులో ఉందన్నారు. హరితహారంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఏపీ వో ఎల్లప్ప కోరారు. ఎంపీడీవో కాళప్ప, తహసీల్దార్ తిరుపతయ్య, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, కోఅప్షన్ సభ్యుడు అబ్దుల్ రహెమాన్, ఎంపీటీసీలు సభ్యు లు వీరరాఘవెడ్డి, అనిత, షహానాజ్‌బేగం, జ్యోతి, సర్పంచ్‌లు ఊరయ్యగౌడ్, సావిత్రమ్మ, మల్లికార్జున్, మాణిక్యమ్మ, ఎంపీవో వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌డ బ్ల్యూఎస్ డీఈ మద్దిలేటి, ఏఈలు జగత్‌చంద్ర, వెంకటేష్, ఐకేపీ ఏపీఎం నర్సిములు పాల్గొన్నారు.