పోషకాహార విలువలు సమాజానికి అందించాలి
ABN , First Publish Date - 2022-10-01T04:42:34+05:30 IST
పోషక ఆహార విలువలు సమాజానికి అందించాలని కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ అన్నారు.
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోషక ఆహార విలువలు సమాజానికి అందించాలని కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయిగార్డెన్‌లో ఐసీడీఎస్ ద్వారా అధికారికంగా నిర్వహించిన పోషక మాసం వేడుకల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషక ఆహార విలువలకు సం బంధించిన సమాచారాన్ని ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి అందిం చాలనుద్దేశంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఏనీమియా కేసులను గుర్తించి వారిపై పూర్తి శ్రద్ధ వ హించాలన్నారు. ఈ మధ్య కాలంలో ఆసుపత్రుల్లో ఏనీమియా కేసులు ప్రసూతి సమయంలో అనేక సమస్యలతో బాధపడుతున్నారని, వారికి చివరి ప్రయత్నంలో చేసే సహాయం కాకుండా ఏనీమి అని గుర్తించి తగిన పౌష్టికాహారాన్ని ఇచ్చి గర్భిణులకు, పిల్లలకు ఆరోగ్య జాగ్రత్తలు చెప్తూ పౌష్టిక ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు కుర్చీలపైన కూర్చొని ఆహారం తీసుకునే విధంగా 55 బెంచీలు, 220 కుర్చీలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మంజూరు చేస్తూ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ కల్పన, జడ్పీ సీఈవో, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి, ఐసీడీఎస్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.