న్యూట్రిషన్‌ కిట్టు గర్భిణులకు అందేలా చూడాలి

ABN , First Publish Date - 2022-12-31T22:59:43+05:30 IST

గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్టు అందేలా చూడాలని తెలంగాణ క మిషనరేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మజ అన్నారు.

న్యూట్రిషన్‌ కిట్టు గర్భిణులకు అందేలా చూడాలి

- జిల్లా ఆసుపత్రిని తనిఖీచేసిన జాయింట్‌ డైరక్టర్‌ పద్మజ

గద్వాల క్రైం, డిసెంబరు 31 : గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్టు అందేలా చూడాలని తెలంగాణ క మిషనరేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మజ అన్నారు. శనివారం గద్వాల జిల్లాలోని అలంపూర్‌, రాజోలి, ఇటి క్యాల ఆసుపత్రిలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఆసుపత్రిలోని లేబర్‌ రూమ్‌ను, ఏఎన్‌సీ వార్డు, ఫోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డు, కేసీఆర్‌ కిట్‌, న్యూటిషన్‌ కిట్స్‌ను పరిశీలించారు. లేబ ర్‌ వార్డులో కాన్పులు ఎన్ని జరిగాయి, ఎంతమందికి కేసీఆర్‌ కిట్స్‌ ఇచ్చారు. ఎంత మంది గర్భిణులకు న్యూటిషన్‌ కిట్స్‌ అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కేసీఆర్‌ కిట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ భాస్కర్‌, ఇంచార్జి డియంహెచ్‌ఓ డాక్టర్‌ శశికళ, డిడియం రామాంజనేయులు, జిల్లా ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

మానవపాడు: ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలతో పాటు ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజ డాక్టర్లకు సూచించారు. శనివారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసిన ఆమె అక్కడి రికార్డుల ను పరిశీలిం చారు. ఆస్పత్రిలో అందుతు న్న వైద్యసే వల ను గురించి అక్కడి వైద్య సిబ్బందితో మా ట్లాడి అడిగి తెలుసు కున్నా రు. డాక్టర్లు అంద జేస్తున్న సేవల పై ఆరా తీశారు. ప్రతీ నెల గర్భిణీలు వైద్యప రీక్షలు చేయించు కు నేలా ఏఎన్‌ఎంలు వా రికి అవగాహన క ల్పించాలని, గర్భిణు లకు రక్తహీనత లే కుండా ప్రభుత్వం ద్వా రా అందజేసే న్యూ ట్రిషన్‌ కిట్‌లను అం దజేయాలన్నారు. హై రిస్క్‌ గర్భిణులను గు ర్తించి వారికి ఎప్పటి కప్పుడు సలహాలు ఇస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగే వి ధంగా వైద్య సిబ్బంది చర్యలు తీసు కోవాలని ఆదేశించా రు. ఆమె వెంటజిల్లా డీఎంహెచ్‌వో శశికళ, కేసీఆర్‌ కిట్‌ జిల్లా మే నేజర్‌ భాస్కర్‌, సౌజ న్య, డాక్ట ర్లు, వరలక్ష్మీ, శశికిరణ్‌, విష్ణు, యా కుబ్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:00:05+05:30 IST

Read more