TS News: అవేమీ కాంగ్రెస్‌పై ప్రభావం చూపవు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN , First Publish Date - 2022-10-18T01:36:40+05:30 IST

మహబూబ్ నగర్ : మాజీ పీసీపీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్‌ఎస్, బీజేపీపై ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గులాబీ బాస్‌ను టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో’ యాత్రపై బీజేపీ చౌకబారు ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

TS News: అవేమీ కాంగ్రెస్‌పై ప్రభావం చూపవు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మహబూబ్ నగర్ : మాజీ పీసీపీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్‌ఎస్, బీజేపీపై ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గులాబీ బాస్‌ను టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో’ యాత్రపై బీజేపీ చౌకబారు ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.  


‘‘ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.  దేశచరిత్రలో ఇంత నీతిమాలిన ఎన్నికలు జరగలేదు. అక్కడ జరుగుతున్నవి పార్టీల్లో చేరికలు కావు. నేతల  కొనుగోళ్లు..వారి ప్రభావం  కాంగ్రెస్ పార్టీపై ఉండదు. ఏఐసీసీ అద్యక్షుడి ఎన్నిక ప్రజాస్వామ్య‌బద్ధంగా జరగటం హర్షనీయం. రాహుల్ గాంధీ పాదయాత్ర  దేశ చరిత్రలో నిలిచిపోతుంది. పాదయాత్ర‌పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేయడం తగదు. దేశంలో పంటల బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. రూ. లక్ష రుణమాఫీ ఏమైందో? స్వయం సహయక సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదు.  వీటికి కేసీఆర్ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.  

Updated Date - 2022-10-18T01:36:40+05:30 IST