పంటనష్ట పరిహారమేదీ

ABN , First Publish Date - 2022-08-26T05:07:30+05:30 IST

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వ్యవసాయం అంటే పండుగలా ఉన్నది.

పంటనష్ట పరిహారమేదీ
పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ షర్మిల

- వైఎస్‌ హయాంలో వ్యవసాయం అంటే పండుగ

- నేడు కేసీఆర్‌ హయాంలో దండుగలా  మారింది

- వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలపై   సబ్సిడీలు ఎత్తేశారు

- కొత్త పింఛన్లు ఇచ్చే దిక్కులేదు

- ఫాంహౌజ్‌కే పరిమితిమైన సీఎం 

- ప్రజా ప్రస్థానం యాత్రలో వైఎస్సార్‌టీపీ  అధ్యక్షురాలు  వైఎస్‌ షర్మిల

పెబ్బేరు/రూరల్‌, ఆగస్టు 25: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వ్యవసాయం అంటే పండుగలా ఉన్నది. నేడు కేసీఆర్‌ సీఎం అయ్యా క దండుగలా చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర  గురువారం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, చెలిమిల్ల, రంగాపూర్‌ల  మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆమె పెబ్బేరు పట్టణంలోని సుభాష్‌ చౌరస్తాలో మాట్లాడారు. వైఎస్‌ హ యాంలో రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేశారని, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించి ఆదుకున్నారని అన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందుతూ రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేవారని అన్నారు.  కేసీఆర్‌ మాత్రం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. అన్ని పథకాలు బంద్‌ చేసి రైతు బంధు ద్వారా రూ. 5వేలు ఇస్తున్నారని అన్నారు. ఈ ఐదువేల తో రైతులు కోటిశ్వరులై కార్లలో తిరుగుతున్నారని, కేసీఆర్‌ భ్రమ పడుతున్నారని ఏద్దేవా చేశారు.  రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతుంటే దొంగ సొ మ్మును మెక్కుతూ ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవుతు న్నారని, అధికారం వచ్చాక ప్రజల మధ్యకు రావడమే మానేశారని ఆమె ఆరోపించారు. బంగారు తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ బాగుపడింది లేద ని అన్నారు. మిగులు రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మా ర్చారని ఆరోపించారు. పాదయాత్ర సందర్భంగా శ్రీకృష్ణుడి శోభ యాత్రలో ఆమెపూజలు చేశారు. వృద్ధులను, మహిళలను అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పాద యాత్రలో ఆ పార్టీ వనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రజల గోడు పట్టించుకోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ఎర్రవల్లి చౌరస్తా : జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి వద్ద వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం రాత్రి బస చేశారు. అనంతరం   గురువారం ఉదయం  పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలు పాదయాత్రలో అమెకు సమస్యలను విన్నవించారు. సమస్యల పరిష్కారం కొసమే రాజన్న బిడ్డ బయలుదేరిందని, రాజన్న రాజ్యవస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలగోడు పట్టదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తనను అశీర్వాదించాలని కోరారు. 





Updated Date - 2022-08-26T05:07:30+05:30 IST